వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు.. కండువా కప్పిన జగన్

2:11 pm, Sun, 15 September 19

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం ఉదయం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా వైసీపీ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీలో చేరానన్నారు.

జగన్‌పై తనకు నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన నేతను ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారని ప్రశంసించారు. ఏపీ అభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు.

ఆ నమ్మకంతోనే పార్టీలో చేరినట్టు చెప్పారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.