ఎంత అప్రదిష్ట? రాయలసీమలో టీడీపీ గెలిచింది 3 సీట్లేనా…!?

TDP Latest News, Chandrababu Naidu News, Rayalaseema Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: మొన్న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొత్తం 175 సీట్లకి పోటీ చేసి కేవలం 23 స్థానాల్లో టీడీపీ గెలిచింది. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించాక ఇంతటి ఘోరపరాజయాన్ని చూడలేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

ఏపీలోని 13 జిల్లాలో టీడీపీ నాలుగు జిల్లాలో ఖాతా కూడా తెరవలేదు. ఇక రాయలసీమ జిల్లాలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు కలిపి మొత్తం 52 సీట్లు ఉన్నాయి. ఇందులో కర్నూలు, కడపలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.

చదవండి: వైఎస్ జగన్‌పై దాడి కేసులో.. నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్!

ఇక చిత్తూరు కుప్పం నుంచి చంద్రబాబు ఒక్కరే గెలిచారు. అలాగే టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే అనంతపురం జిల్లాలో టీడీపీ 2 సీట్లు గెలిచింది. ఒకటి కంచుకోట హిందూపురంలో బాలయ్య గెలవగా, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలిచారు.

రాయలసీమలో మొత్తం 52 సీట్లలో టీడీపీ 3 గెలిస్తే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. ఇక 6 పార్లమెంట్ స్థానలని వైసీపీ కైవసం చేసుకుంది.

టీడీపీని ఆదుకున్న మూడు జిల్లాలు…

ఇంతటి వైసీపీ వేవ్‌లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో టీడీపీ నాలుగేసి స్థానాల్లో విజయం సాధించింది. విశాఖ నగరంలో ఉన్న నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలని టీడీపీనే గెలుచుకుంది.

అటు తూర్పులో రాజమండ్రి రూరల్, సిటీ, మండపేట, పెద్దాపురంలో టీడీపీ హవా కొనసాగింది. అలాగే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న ప్రకాశంలో టీడీపీ 4 సీట్లు గెలుచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రకాశంలో పర్చూరు, అద్దంకి, చీరాల, కొండపిలలో టీడీపీ జెండా ఎగిరింది.

ఇక శ్రీకాకుళంలో ఇచ్చాపురం, టెక్కలి, పశ్చిమ గొదావరిలొ పాలకొల్లు, ఉండి, కృష్ణాలో విజయవాడ ఈస్ట్, గన్నవరం. గుంటూరులో గుంటూరు వెస్ట్, రేపల్లె నియోజకవర్గాల్లో గెలుపొందింది. విజయనగరం, నెల్లూరులో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

చదవండి: ప్రతిసారి నియోజకవర్గం మార్చిన గంటా విజయం ఎలా సాధ్యం….?
- Advertisement -