25 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీరే: అసెంబ్లీ తుది జాబితా విడుదల

11:24 am, Tue, 19 March 19
Assembly Latest News, Final List Of Candidates for assembly, Newsxpressonline

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గపడుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాను, పార్లమెంటు అభ్యర్థుల పూర్తి జాబితాను సోమవారం రాత్రి ప్రకటించారు. పది మంది సిట్టింగ్‌ ఎంపీలకు అవే స్థానాలు దక్కాయి. జాబితాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, నలుగురు కేంద్ర మాజీ మంత్రులున్నారు. రాజమహేంద్రవరం, అనంతపురంలో ప్రస్తుతం ఎంపీల వారసులకు టికెట్లు కేటాయించారు.

రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కోడలు రూప ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి టికెట్‌ దక్కింది. విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు అనకాపల్లి స్థానం లభించింది.

కాంగ్రెస్‌ నుంచి ఇటీవల పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి కర్నూలు, వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌కి అరకు, పనబాక లక్ష్మికి తిరుపతి లోక్‌సభ టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు విజయనగరం నుంచే రంగంలో నిలిచారు. చలమలశెట్టి సునీల్‌కి కాకినాడ సీటు లభించింది.

టీడీపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే..

శ్రీకాకుళం – కె.రామ్మోహన్‌నాయుడు
విజయనగరం -అశోక గజపతిరాజు
విశాఖపట్నం -భరత్‌
అనకాపల్లి- అడారి ఆనంద్‌
అరకు (ఎస్టీ)- వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌
కాకినాడ- చలమలశెట్టి సునీల్‌
అమలాపురం(ఎస్సీ)- గంటి హరీష్‌
రాజమహేంద్రవరం- మాగంటి రూప
నర్సాపురం- వి.వెంకట శివరామరాజు
ఏలూరు -మాగంటి బాబు
మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ
విజయవాడ- కేశినేని వెంకటేశ్వర్లు (నాని)
గుంటూరు -గల్లా జయదేవ్‌
నరసరావుపేట -రాయపాటి సాంబశివరావు
బాపట్ల(ఎస్సీ) -శ్రీరామ్‌ మాల్యాద్రి
ఒంగోలు- శిద్దా రాఘవరావు
కడప- సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి
నెల్లూరు- బీదా మస్తాన్‌రావు
నంద్యాల- ఎం.శివానందరెడ్డి
కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
రాజంపేట- డీకే సత్యప్రభ
అనంతపురం- జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
హిందూపురం- నిమ్మల కిష్టప్ప
తిరుపతి(ఎస్సీ)- పనబాక లక్ష్మి
చిత్తూరు(ఎస్సీ)- ఎన్‌.శివప్రసాద్‌

అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు వీరే..

1. నెల్లిమర్ల- పతివాడ నారాయణ స్వామి
2. విజయనగరం- అదితి గజపతి రాజు
3. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి
4. మాడుగుల – రామానాయుడు
5. చోడవరం- కేఎస్ఎన్ రాజు
6. భీమిలి- సబ్బం హరి
7. గాజువాక- పల్లా శ్రీనివాస్
8. అమలాపురం- అయితా బత్తుల ఆనందరావు
9. నిడదవోలు- శేషారావు
10. నర్సాపురం- మాధవ నాయుడు
11. పోలవరం- బొరగం శీను
12. మాచర్ల- అంజి రెడ్డి
13. బాపట్ల- అన్నం సతీష్
14. నరసరావుపేట- అరవింద్ బాబు
15. తాడికొండ- శ్రావణ్
16. దర్శి- కదిరి బాబూరావు
17. కనిగిరి- ఉగ్ర నరసింహా రెడ్డి
18. కావలి – కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి
19. ఉదయగిరి- బొల్లినేని రామారావు
20. నెల్లూరు రూరల్- అజీజ్
21. వెంకటగిరి-కురుగొండ్ల రామకృష్ణ
22. కడప- అమీర్ బాబు
23. రైల్వే కోడూరు- నర్సింహ ప్రసాద్
24. ప్రొద్దుటూరు-లింగారెడ్డి
25. నంద్యాల-భూమా బ్రహ్మానంద రెడ్డి
26. కర్నూలు అర్బన్- టీజీ భరత్
27. కోడుమూరు- రామాంజనేయులు
28. కదిరి- కందికుంట ప్రసాద్
29. గుంతకల్లు- జితేందర్ గౌడ్
30. కళ్యాణ దుర్గం- ఉమ మహేశ్వర నాయుడు
31. సింగనమల-బండారు శ్రావణి
32. అనంతపురం అర్బన్- ప్రభాకర్ చౌదరి
33. పూతలపట్టు- తెర్లాం పూర్ణం
34. సత్యవేడు- రాజశేఖర్
35. తంబళ్లపల్లి-శంకర్ యాదవ్ లేదా లక్ష్మీ దేవమ్మ
36. గంగాధర నెల్లూరు- హరికృష్ణ(కుతూహలమ్మ కొడుకు)