అరటిపళ్లు అమ్ముకుంటున్న టీచర్.. సాయం చేసిన పూర్వ విద్యార్థులు

- Advertisement -

ప్రైవేటు స్కూళ్లలో ఉపాధ్యాయుడంటే ఓ మార్కెటింగ్ ఏజెంట్‌తో సమానమని అనేకమంది అభిప్రాయం.

అయితే ఇది ఎంతవరకు నిజమో పక్కనపెడితే నెల్లూరులోని ఓ సంఘటన మాత్రం దీనికి అద్దం పడుతోంది.

- Advertisement -

ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఉపాధ్యాయుడు రోడ్డుపై అరటిపళ్లు అమ్ముకోవడం ప్రారంభించాడు.

3 వారాల నుంచి ఇదే తరహాలో అరటిపళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన పూర్వ విద్యార్థులు చలించిపోయారు.

వెంటనే తమ గురువును ఆదుకోవాలని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి రూ.86వేలకు పైగా చందాలు సేకరించి ఆయనకు అందించారు.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని నారాయణ స్కూల్‌లో వెంకట సుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు తెలుగు టీచర్‌గా పనిచేసేవారు.

అయితే పాఠశాలలో కొత్త అడ్మిషన్లు చేయించడంలో ఆయన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.

దీంతో యాజమాన్యం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో జీవనాధారం కోసం దాదాపు 3 వారాలుగా రోడ్డుపై అరటిపళ్లు అమ్ముకుంటున్నారు.

తమ టీచర్ దుస్థితి తెలుసుకున్న దాదాపు 150మంది పూర్వ విద్యార్థులు రూ.86,300 సేకరించి అందించారు.

దీంతో వెంకటసుబ్బయ్య ఎంతో సంతోషించారు. తాను తిరిగి ఉపాధ్యాయుడిగా కొనసాగాలనుకుంటున్నానని, తక్కువ జీతం వచ్చినా పర్వాలేదని చెప్పారు.

తనకు సాయం చేసిన విద్యార్థులందరికీ ఎంతో కతజ్ఞతలనీ వెంకటసుబ్బయ్య చెప్పారు. వారికి తాను ఉపాధ్యాయుడిని అయినందుకు ఎంతో ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు.

- Advertisement -