కాంగ్రెస్ గెలిస్తే.. ప్రత్యేక హోదాపై తొలి సంతకం: డాక్టర్ పాండురంగారావు

3:43 pm, Fri, 29 March 19
Dr. Panduranga Rao Latest News, Congress News, Tuni Latest News, Newsxpressonline

తుని: కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని, ఆ ఫైల్ పై తొలి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని  తుని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజావైద్యశాల డాక్టర్ పాండురంగారావు ఇంటింటికి వెళ్లి మరీ చెబుతున్నారు.

తుని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి..అందరిని కలుస్తూ మండుటెండను కూడా లెక్కచేయకుండా ప్రచారంలో నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రధానమైన హామీలను ప్రస్తావిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవాటిని ఆయన వివరిస్తున్నారు.

  • కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా..
  • రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
  • పేదలకు రూ.72 వేల వరకు కనీస ఆదాయం వచ్చేలా ప్రణాళిక
  • ప్రతి డ్వాక్రా గ్రూప్ నకు రూ.2లక్షల వరకు రుణమాఫీ
  • పేద కుటుంబాలకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం
  • వృద్ధులు, వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్లు
  • 50 నుంచి 60 ఏళ్ల వయసువారికి నెలకి రూ.2 వేల ఫించను
  • 60 నుంచి 70 ఏళ్ల లోపు వారికి నెలకి రూ.2,500
  • 70 ఏళ్లు పైబడినవారికి, వికలాంగులకు నెలకి రూ.3000
  • అమ్మహస్తం ద్వారా 9 నిత్యావసర సరుకులు ఉచితం..                                                                                                                                                                                                    ఇలా అన్నీ సాధ్యమైనవే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని డాక్టరుగారు చెబుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ జగన్మోహన్ రెడ్డిలా అలవికానీ హామీలివ్వడం, మోదీలా అరచేతిలో స్వర్గం చూపించడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఎంత వరకు చేయాలో అంతవరకే చేస్తామని..                                                                                                                                                                                       నేల విడిచి సాము చేయడం, సాధ్యం కాని హామీలు గుప్పించడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదన్నారు. ఇది ప్రజల పార్టీ.. బ్రిటీష్ వారి దగ్గర బానిస బతుకుల నుంచి మనల్ని విముక్తులను చేసి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ.. భారతదేశంలో ప్రజాస్వామ్య మూలాలు స్థాపించిన పార్టీ..అలా దేశానికెంతో చేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజల కోసమే పనిచేస్తుంది..                                                                                                                                          ప్రధాని మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారు..అది బీజేపీ పార్టీ నైజం..   ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూసిన మీ అందరూ.. పార్టీని విశ్వసించి.. నా సేవాధర్మాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి..తుని నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించి.. అభివృద్ధిని కళ్లారా చూడండి.. అంటూ డాక్టర్ పాండురంగారావు గారు ఇంటింటి ప్రచారంలో ప్రజల దగ్గరకు వెళ్లి చెబుతున్నారు.                                                                                                                                                                                            ఇలా ఉదయం నుంచి డాక్టరు గారు ప్రచారంలో నిమగ్నమై తన ప్రచార రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. డాక్టరు గారు వెళ్లిన ప్రతిచోటా ప్రజలు అభిమానంతో తండోపతండాలుగా ముందుకు వస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు.. స్వాగతిస్తున్నారు..ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఆయన చెబుతున్న హామీలన్నింటినీ ఎంతో శ్రద్ధగా వింటున్నారు..వెళ్లిన ప్రతిచోటా డాక్టరు గారు అందరినీ పేరుపేరున పలకరిస్తున్నారు..                                                                                                                                                             ఎందుకంటే 30 ఏళ్ల నుంచి..ఆయన ప్రజాసేవలోనే ఉన్నారు.. అన్ని ఊర్లు, అన్ని గ్రామాలు ఆయనకు తెలుసు..అందరూ పరిచయమే..  అందువల్ల డాక్టరు బాబుకే మా ఓటు అంటూ వాళ్లు నినాదాలు చేస్తున్నారు. మీ వెనుక మేం ఉన్నామంటూ భరోసా ఇవ్వడం విశేషం.
– శ్రీనివాస్ మిర్తిపాటి