కేంద్రంలో గెలిచేది ఆ పార్టీయేనట.. చంద్రబాబు చెప్పేశారు

9:32 pm, Wed, 8 May 19

కోల్‌కతా: కేంద్రంలోని అధికార బీజేపీకి నూకలు చెల్లిపోయాయని, వచ్చేది బీజేపీయేతర ప్రభుత్వమేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఈ నెల 23న వెల్లడి కానున్న ఫలితాల్లో బీజేపీ ఓటమి ఖాయన్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తొలిరోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మమతను బెంగాల్ టైగర్‌గా అభివర్ణించారు.

బెంగాల్‌ అభివృద్ధి చెందాలంటే తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మమత కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందన్నారు.

50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని ఈసీఐని కోరుతున్నామన్నారు. ఓటు వేశాక ఓసారి అందరూ వీవీప్యాట్‌ స్లిప్‌ని సరిచూసుకోవాలని సూచించారు. ఓటింగ్‌ సమయంలో ఎవరైనా తప్పుచేస్తే నిలదీయాలని చంద్రబాబు పేర్కొన్నారు.

చదవండి:  ఫలితాలు వచ్చే వరకు కిడారిని మంత్రిగా కొనసాగించేందుకు సీఎం ప్రయత్నాలు….