టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే!

9:44 am, Mon, 25 March 19
This is the list of TDP Star Campers News, AP Election Latest News, TDP Latest News, Newsxpressonline

హైదరాబాద్: రాష్ట్రంలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. సమయం ఎక్కువగా లేకపోవడంతో ఎక్కువమందితో వీలైనంత అధికంగా ప్రచారం చేయించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ మేరకు హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా రూపొందించింది. ఈ జాబితాలో ఉన్న నేతలు రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించి టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటారు. చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, మురళీమోహన్,నందమూరి బాలకృష్ణ, సుజనాచౌదరి, ఫరూక్, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, నాగుల్ మీరా, వంగవీటి రాధా, లంకా దినకర్, కోటేశ్వరరావు.  

వీరితో పాటుగా వైవీబీ, పంచుమర్తి, దివ్యవాణి, బుద్ధా వెంకన్న, పోతుల, గోవిందరెడ్డి, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, ఆనంద్ సూర్య, గుంటుపల్లి, అంబికాకృష్ణ, అశోక్ బాబు, విజయభారతి, రేవతి, రామాంజనేయులు ఈ జాబితాలో ఉన్నారు.

కాగా, కొత్తగా పార్టీలో చేరిన వంగవీటి రాధాకు కూడా జాబితాలో చోటివ్వడం విశేషం అని చెప్పాలి. ప్రజలను ఆకర్షించగలిగే సత్తా రాధాకు ఉందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. అంతేగాకుండా, పార్టీ తరఫున గట్టిగా గళం వినిపిస్తున్న సినీ నటి దివ్యవాణికి కూడా స్టార్ క్యాంపెయినర్ హోదా కల్పించారు.