వైయస్ వివేకానందరెడ్డి పోస్ట్ మార్టం ఆలస్యం కావడానికి అసలు కారణం ఇదే

12:06 pm, Sat, 16 March 19
This is the reason for post-mortem delay of YS Vivekananda Reddy, Newsxpressonline

కడప: వైయస్ వివేకానందరెడ్డి మరణం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తొలుత గుండెపోటుతో ఆయన మరణించారంటూ ప్రచారం జరగింది. ఆ తర్వాత ఆయన దారుణ హత్యకు గురయ్యారనే విషయం పోస్ట్ మార్టంలో వెల్లడైంది. అయితే, ఆయన పోస్ట్ మార్టం కొంచెం ఆలస్యంగా జరిగింది.

కూతురే కారణం..

వివేకా మృతి విషయంలో పలు అనుమానాలు వ్యక్తం కావడంతో… ఆయన మృత దేహాన్ని అర్బన్ సీఐ శంకరయ్య హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు. అయితే, వివేకా కుమార్తె సునీత హైదరాబాదులో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే… తాను వచ్చేంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించవద్దని, వైద్యులను సిద్ధంగా ఉంచాలని ఆమె కోరారు. ఆమె కోరిక మేరకు ఆమె వచ్చేంత వరకు పోస్ట్ మార్టంను నిర్వహించలేదు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సునీత పులివెందులకు చేరుకున్నాక… రిమ్స్ వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. శవ పరీక్షలో ఆయన హత్యకు గురైనట్టు తేలింది.