వైసీపీకి కలిసిరానున్న ఆ ఐదు అంశాలు..

YS Jagan, Newsxpressonlie
- Advertisement -

అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో రాజకీయ వేడి పీక్స్ చేరింది. కచ్చితంగా నెల రోజులే సమయం ఉంది. అధికారం కోసం భీకర పోరాటం చేస్తున్న ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షానికి అయిదు ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి విడతలొనే ఏపీలో ఎన్నికలు పెట్టడం ఏ విధంగా వైసీపీకి కలసివస్తుందో ఇప్పుడు చూద్దాం.

1. దేశంలో ఎవరూ చేయలేని విధంగా వైసీపీ అధినేత జగన్ పద్నాలుగు నెలల పాటు ఏపీవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. నిన్నటి వరకూ ఆయన జనంలోనే ఉన్నారు. ఆ వేడి అలా ఉండగానే ఏపీలో ఎన్నికల నగారా మోగింది.
2 ఎన్నికలు ఎంత తొందరగా పెడితే విపక్షానికి అంత అడ్వాంజేజ్. అదే అధికారంలో ఉన్న పార్టీకి ఎంత ఆలస్యం చేస్తే అంత వెసులుబాటు ఉంటుంది. ఇపుడు ఎన్నికల గంట ముందే మోగడం వైసీపీకి బాగానే కలసి వచ్చే అంశం.
3 ఇపుడు దేశంవ్యాప్తంగా సర్వేలు ఎన్ని చూసినా వైపీకే మొగ్గు ఉంది. జనంలో ఈ పాజిటివ్ బజ్ ఇలా ఉండగానే ఎన్నికలకు వెళ్ళడం వైసీపీకి పెద్ద ప్లస్.
4 ఏపీలో ఇపుడు టీడీపీ, వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు ఇంకా సర్దుకోలేదు. కేవలం నెల మాత్రమే గడువు వుంది. ఇపుడు హఠాత్తుగా ఎన్నికలు రావడంతో ముఖా ముఖీ పోరు సాగనుంది. అది కచ్చితంగా జగన్ పార్టీకి భారీగా హెల్ప్ చేసే పరిణామమే.
5. కాస్త ముందుగా ఎపుడు జరిగినా అధికార పార్టీకి పెద్ద ఇబ్బందులు రావడం ఇంతవరకూ ఉమ్మడి ఏపీలోనూ, దేశ రాజకీయాల్లోనూ జరిగిన ఆనవాయితీ. ఆ యాంటీ సెంటిమెంట్ ఇపుడు వైసీపీకి వరంగా మారబోతోంది. తొందరగా ఎన్నికలు వచ్చిపడడం నిజంగా ఫ్యాన్ పార్టీకి అన్ని రకాలుగా కలసివచ్చే అంశమే.

- Advertisement -