తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

11:12 am, Sat, 2 February 19
ttd electronic dip

ttd electronic dip

తిరుమల: శ్రీవారి ఆన్ లైన్ ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మే నెలకు సంబందించిన 70,786 ఆర్జితసేవ టికెట్లును టీటీడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్ లైన్ డిప్ ద్వారా ఎంపిక చేయడానికి 11,486 టికెట్లను విడుదల చేశారు.

శ్రీవారి ఆర్జిత సేవ..

అందులో భాగంగా సుప్రభాత సేవ టికెట్లు:8,091, తోమాల&అర్చన:240, అస్టదళపాద పద్మారాధన:240, నిజపాద దర్శనం:2,875 జనరల్ కేటగిరి ద్వారా 59,300 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు. అలాగే విశేష పూజ 2,000, కల్యాణం సేవా: 14,725, ఊంజల్ సేవా: 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం: 7,425, వసంతోత్సవం: 14,300, సహస్రదీపాలంకరణ సేవా: 16,200 .

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఈవో తెలియజేశారు గతంలో చోటుచేసుకున్న అక్రమాలను అరికట్టేందుకు రిజిస్ట్రేషన్‌లో మార్పులు తీసుకువచ్చారు. ఒక ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబరు ఆధారంగా ఒకే రిజిస్ట్రేషన్‌కు తితిదే అవకాశం కల్పించింది.