వర్మ ఒక సైకో! యామిని సంచలన వ్యాఖ్యలు!

5:36 pm, Tue, 30 April 19
Yamini Latest Updates News, Ram Gopal Varma News, Lakshmi's NTR , Newsxpressonline

అమరావతి: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్‌కు ముందు ప్రెస్‌‌మీట్ పెట్టడానికి యత్నించిన ఆర్జీవీని అడ్డగించి బలవంతంగా హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కించి పంపిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై యామిని మాట్లాడుతూ.. ఆర్జీవీ సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వర్మలాంటి సైకోకు వైసీపీ అధినేత జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు.

చదవండి:  నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. వాటిపై సినిమా తియ్: వర్మకు దివ్యవాణి సవాల్

కాగా.. ఆర్జీవీ మద్దతు పలుకుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం విదితమే. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే అదే రీతిలో ప్రతి విమర్శలు చేసే వర్మ, అయితే యామిని వ్యాఖ్యలపై ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే. మే-01న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఏపీలో విడుదల చేస్తున్నామని చిత్రం యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ యత్నించగా, పోలీసులు అడ్డుకుని, బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించి, పంపించేశారు. ఈ సందర్భంగా వర్మకు మద్దతుగా జగన్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే, యామిని వర్మ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

చదవండి:  ఏపీ సీఎస్‌పై మండిపడ్డ యామిని! ‘‘వైసీపీ నేతలను ప్రజలే తరిమికొడతారు..’’