చేనేత కార్పొరేషన్ ద్వారా లక్ష అడుగుల దారి పడింది..అది శత కోటి అడుగుల మార్గం కావాలి

12:34 pm, Mon, 1 April 19
Vavilala Sarala Devi Campaigning News, TDP Latest News, AP News, Newsxpressonline
స్ఫూర్తిదాయక ప్రచారాలతో. రాష్ట్ర చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ వావిలాల సరళాదేవి ముందడుగు. చేనేత సంఘీయుల ఇంటింటికి వెళుతూ ప్రచారం. మండుటెండల్లో రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వీవర్స్ కాలనీలు, మండలాలు, గ్రామాల్లో సమావేశాలు

నెల్లూరు (వెంకటగిరి): ఇంతవరకు చేనేతలకు అదిచేస్తాం..ఇది చేస్తాం అని చెప్పినవారేగాని..దానిని ఆచరణలో చూపించినవారు ఒక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, ఈరోజున చేనేత కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఒకేసారి లక్ష అడుగుల మార్గం ఏర్పాటుచేశారని..దానిని మనం కోటి, శత కోటి అడుగుల మార్గంగా మార్చుకోవాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని రాష్ట్ర చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ వావిలాల సరళాదేవి పేర్కొన్నారు.

Vavilala Sarala Devi Campaigning News, TDP Latest News, AP News, Newsxpressonline

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా ఆమె అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ.. చేనేత వర్గీయులు ఉన్న ప్రతిచోటుకి వెళుతున్నారు. అక్కడ వారితో కలుస్తున్నారు. రాబోయే రోజుల్లో చేనేతలకు జరిగే మేలు, తెలుగుశం ప్రభుత్వం అందించే చేనేత పథకాలు వివరిస్తున్నారు.

అంతకుమించి చేనేత కార్పొరేషన్ ద్వారా ఒక స్ఫూర్తిదాయక అడుగు పడిందని..ఇక సమస్యల కోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదని, ఎదురుచూడాల్సిన అవసరం అంతకన్నా లేదని, నేరుగా చేనేత కార్పొరేషన్ కి చిన్న ఉత్తరం రాసినా, ఫోను చేసినా చాలునని వెళ్లిన ప్రతిచోటా చెబుతున్నారు.

 మీరెలాంటి సమస్య చెప్పినా రికార్డు అవుతుంది..

ప్రభుత్వపరంగా తీసుకునే విధానపరమైన నిర్ణయాలైతే నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. అదే ఇంతకుముందైతే ఒక సమస్య వస్తే చేనేత జౌళి మంత్రిత్వ శాఖకు వెళ్లేదని, అక్కడ నుంచి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలంటే  అదంతా ఒక ప్రయాసగా ఉండేదని తెలిపారు.

ఇప్పుడు ఒకొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారే ..

మనల్ని పిలిచి.. చేనేత కార్పొరేషన్ పరిస్థితేమిటి? ఎలా జరుగుతుంది? ఇంతవరకు ఏం చేశారు? ఏమిటి ప్రధాన సమస్యలు.. ఇలా ఆయనే పిలిచి అడుగుతుంటారు. వివరాలు తీసుకుంటారు. ఎందుకంటే ఆయన 24 గంటలు పనిచేస్తుంటారు..ఆయన నిద్రపోరు..మనల్ని నిద్రపోనివ్వరూ.. ఈ సంగతి మనందరకూ తెలుసు..అంతా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూనే ఉంటారు. అంతా ఆయన కంప్యూటర్ ముందు కూర్చుని రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తుంటారు. అందుకే చెబుతున్నాను.

మనకు మంచిరోజులొచ్చాయి…

ఇప్పుడే ఆరంభమైంది. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మన చేనేత కార్పొరేషన్ ద్వారా మన చేనేత కులాల జీవితాలు ఎలా మార్పుచెందాయో మీరే గ్రహిస్తారు. ఇదే సరైన సమయం..ఈసారి పట్టు వదలకూడదు. అందరం కలిసి కట్టుగా ఉండి తెలుగుదేశాన్ని గెలిపించి..సామాజిక చైతన్యం అంటే ఏమిటో చూపించాలి.

మన బలమేమిటో నిరూపించడానికి ఇదే సరైన సమయం..

అందుకే రండి..మనకు చేనేత కార్పొరేషన్ ఇచ్చి మన సమస్యలు మనమే పరిష్కరించుకునేలా చేసిన మహావ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మన జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించిన మహానుభావుడికి..మనం ఓటేసి రుణం తీర్చుకుందాం..అని తెలుగుదేశం పార్టీ ద్వారా రాబోయే రోజుల్లో జరగబోయే మంచిని వివరిస్తూ పగలు పర్యటనలు, రాత్రిళ్లు చేనేత కులాల వారితో సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

Vavilala Sarala Devi Campaigning News, TDP Latest News, AP News, Newsxpressonline

చిత్తూరు జిల్లాలో..

మదనపల్లె, తంబాలపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు, రామసముద్రం, నిమ్మనపల్లి మండలాలు చేనేత వర్గీయులున్న గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న చేనేత పథకాలను వివరించారు.

నెల్లూరు జిల్లా వెంకటిగిరి నియోజకవర్గంలో..

చేనేత కుల వర్గీయులు ఉన్న వార్డుల్లో పర్యటించారు. వారితో సమావేశాలు ఏర్పాటుచేసి చేనేత కార్పొరేషన్ కు సంబంధించి విలువైన మాటలు వావిలాల సరళాదేవి చెప్పారు. ప్రతినెలా, ప్రతి వారం మన చేనేత కార్పొరేషన్ కి సంబంధించి  సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో  అమరావతిలో మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసే కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశాలు ఉంటాయని..ప్రతి జిల్లా సమస్య, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తికి సంబంధించి సమస్యలు..

మీరు నేరుగా చెప్పినా సరే, మాదృష్టికి వచ్చినవి ఉంటే అక్కడ  ప్రస్తావించి, ప్రత్యేక దృష్టి పెట్టి తక్షణం పరిష్కరిస్తామని వివరిస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఒక్క మన చేనేత కులాలకే కాదు..రాష్ట్రాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని చెబుతున్నారు.

వైసీపీ వాళ్లు చెప్పేవి ఆచరణ సాధ్యం కావు..

పదేళ్ల నుంచి అధికారంలో లేని జగన్ పార్టీకి ఓటేస్తే..వాళ్లు సర్దుకొని నిలదొక్కుకోవడానికి ఈ ఐదేళ్లు సరిపోవని విమర్శించారు. అంతేగాని..ఆయన చెబుతున్నట్టు నవరత్నాల హామీలు ఆచరణ సాధ్యం కానివని, కల్లబొల్లి మాటలతో మాయలో పడవద్దని హెచ్చరించారు.

ఒక అడుగు పడింది..దానిని వంద, వేయి, లక్ష, కోటి అడుగుల మార్గంగా మనం మార్చుకోవాలని చివరిగా తెలిపారు. ఈకార్యక్రమంలో ఆమె వెంట తోడుగా ప్రచార కార్యక్రమంలో నడుస్తున్న భర్త వావిలాల వెంకట రమేష్, ఇంకా జిల్లా ఎమ్మెల్యేలు, ఆప్కాబ్ చైర్మన్లు, తెలుగుదేశం ప్రతినిధులు, చేనేత కులవర్గీయులు, పాల్గొంటున్నారు.

-శ్రీనివాస్ మిర్తిపాటి