జనసేనలో చేరిన లక్ష్మీనారాయణపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

2:18 pm, Mon, 18 March 19
vijaya sai reddy slams VV lakshminarayana for joining in Janasena, Newsxpressonline

అమరావతి: జనసేన పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీలో చేరితే ప్రజలు ఛీకొడతారనే జనసేనలో లక్ష్మీనారాయణ చేరారని ఆయన వ్యాఖ్యానించారు.

లక్ష్మీనారాయణ.. పచ్చ జవానే గదా

‘ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మీనారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేశారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’ అని ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి విమర్శించారు.

అంతేగాక, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. తుప్పునాయుడు అంటూ ఎద్దేవా చేశారు. లేనిపోని మాటలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు.

‘35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయటపడలేక పోయారేమిటి తప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవడండి ట్రీట్మెంట్ ఇస్తాడు’ అని చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.