రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది: జగన్‌కి విజయశాంతి సూచన

vijayashanti
- Advertisement -

హైదరాబాద్: తాజాగా ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి మంత్రివర్గంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం జగన్ రోజాకు తన కేబినెట్‌లో స్థానం ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రివర్గంలో రోజాను కూడ తీసుకుని ఉంటే బాగుండేదని, తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు.

చదవండి: ఆగస్టులో వాలంటీర్లు..అక్టోబర్‌లో గ్రామ సచివాలయం ఉద్యోగుల నియామకాలు

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు పెట్టారు. సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని, సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని  పేర్కొన్నారు.

అయితే రాబోయే రోజుల్లో జగన్ రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాని అన్నారు. ఇక పనిలో పనిగా సీఎం కేసీఆర్‌పైనా విజయశాంతి విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ తన మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు మహిళను లేకుండా చేశారని, మరో ఐదేళ్లు ఇదే ప్లాన్ తో ఉన్నారని మండిపడ్డారు. జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా?  అని ప్రశ్నించారు.

చదవండి: పవన్ నా సలహాలు ఎప్పుడు తీసుకోలేదు: రావెల కిశోర్

- Advertisement -