‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ కథనానికి స్పందన: హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే రూ.1,100 జరిమానా…

raffic police
- Advertisement -

raffic police

ఆర్టీఏ సౌజన్యంతో న్యూస్ ఎక్స్ ప్రెస్. ఆన్ లైన్ యూట్యూబ్ ఛానల్‌ రూపొందించిన ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’  వీడియో కథనానికి విజయవాడ కలెక్టర్ స్పందించారు.  దీనిపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిగింది.

- Advertisement -

విజయవాడ : వారాంతంలో డ్రంకన్ డ్రైవ్‌ తనిఖీలు జరుగుతున్నా, కేసులు రాసి, జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల తీరు మారట్లేదు. ఈ నేపథ్యంలో ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్.ఆన్‌లైన్ యూట్యూబ్ ఛానల్ ’లో ప్రసారమైన ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్’ కథనానికి విజయవాడలో కలెక్టర్ స్పందించారు.

హెల్మెట్‌ ధరించండి నాయనా.. అని మొత్తుకుంటున్నా ఎవరు తలకెక్కించుకోవడం లేదు. ఈ విషయాలపై విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రహదారి భద్రతా సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీఎంసీ, ట్రాఫిక్‌, రవాణా శాఖ అధికారులతోపాటు రెవెన్యూ, రహదారులు, భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు. వాహనదారుల తీరు.. వారు నిర్లక్షంగా వాహనాలు నడుపుతున్న తీరు మొదలైన అంశాలపై చర్చించిన జిల్లా యంత్రాంగం వాహనదారులకు షాక్‌ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది.

భారీగా జారిమానాలు…

ఈ శనివారం నుంచి ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతోపాటు వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను  కూడా రద్దు చేస్తారు. అదే హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే రూ.1,100 జరిమానా విధిస్తారు. ఈ మూడు కఠినమైన నిబంధనలను అమలుచేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.  మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారికి పాయింట్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నిర్ధేశిత పాయింట్లు దాటిన వారి లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దు చేస్తారు.

కేసులతో భయం పడటలేదు…

గత సంవత్సరం హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపిన నాలుగు లక్షల మందిపై కేసులు నమోదు చేశారు. ఒక్కో కేసుకు 100 రూపాయల చొప్పున జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి చెక్‌ పెట్టడానికి వారాంతంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ప్రధాన కూడళ్లలో బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గడిచిన సంవత్సరలో మొత్తం 5,498 కేసులు వరకు నమోదయ్యాయి. ఈ కేసుల్లో చిక్కిన వారికి 2వేల రూపాలయల జరిమానాతో పాటు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నారు. వారికి న్యాయస్థానంలో రెండు నుంచి మూడు రోజులపాటు శిక్షలు పడుతున్నాయి. కొంత మందికి ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయినా పెద్దగా మార్పు రావడం లేదు.

ప్రమాదాలు తగ్గించడానికే కఠిన నిర్ణయాలు…

గడిచిన అయిదారు సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయినా సరే రోజుకి సరాసరిన ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది మరణిస్తున్నారనే సంగతి విధితమే. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు సంత్సరాలలో దీన్నిజీరో శాతానికి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్రవాహనదారుల వల్లే జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. వాహనదారులకు కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఇదీ న్యూస్ ఎక్స్‌ప్రెస్.ఆన్‌లైన్ రూపొందించిన వీడియో…

- Advertisement -

1 COMMENT