మీడియా ముందుకు రానున్న వివేకా కుమార్తె సునీత! ఎంచెప్పబోతుందా తెలుసా?

10:28 am, Wed, 20 March 19
Viveka daughter sunitha to come up with media, YS Vivekananda reddy murder News, Newsxpressonline

కడప: గత వారంలో హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, నేడు మీడియాతో మాట్లాడాలని నిర్ణయించారు. అనూహ్యంగా ఆమె మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకోగా, సంచలన విషయాలను ఆమె వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వారికీ లాభం..ఎవరికీ నష్టం

తన తండ్రికి ఎవరితో ప్రాణాపాయం ఉంది? ఆయనంటే ఎవరికి పగ, ప్రతీకారాలు ఉన్నాయి? బెంగళూరులో నెలకొన్న భూ వివాదం నేపథ్యం తదితర వివరాలను ఆమె వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
కాగా, ఈ కేసు విచారణలో భాగంగా ఎర్ర గంగిరెడ్డిని బెంగళూరులో ఉన్న సైట్ దగ్గరకు తీసుకెళ్లిన సిట్ అధికారులు, వివేకా హత్యకు ముందు కోట్ల రూపాయలు చేతులు మారినట్టు గుర్తించారని సమాచారం.

ఇకపోతే గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శేఖర్ ల బ్యాంకు ఖాతాల్లో భారీగా డబ్బులు జమ అయ్యాయని కూడా సిట్ అధికారులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో శేఖర్ రెడ్డి, వివేకా ఇంటి పరిసరాల్లోనే ఉన్నట్టు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే మీడియాతో మాట్లాడనున్న సునీత చెప్పే కొన్ని విషయాలతో ఈ కేసులోని చిక్కుముడులు వీడే అవకాశం ఉన్నటు సమాచారం.