సీబీఐకి పశ్చిమ బెంగాల్‌లోనూ ‘నో ఎంట్రీ’!?.. చంద్రబాబు బాటలోనే మమతా బెనర్జీ, త్వరలోనే నిర్ణయం…

cbi-mamata-benarjee
- Advertisement -

cbi-mamata-benarjee

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. ఏపీలో సీబీఐ ప్రమేయాన్ని నిరాకరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘‘సమ్మతి’’ ఉత్తర్వును ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

చదవండి: సంచలనం: కేంద్రానికి ఏపీ లెంపకాయ్, సీబీఐకి ఏపీలో ‘నో ఎంట్రీ’, చంద్రబాబు ప్రభుత్వం అనూహ్య నిర్ణయం!

అయితే చంద్రబాబు నాయుడు  తీసుకున్న ఈ నిర్ణయంపై మమతా బెనర్జీ తాజాగా స్పందించారు. ‘‘చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైందే…  చంద్రబాబు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.. ’’ అంటూ మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉత్తర్వులకు మద్దతు పలికారు.

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వును ‌తెలుగుదేశం ప్రభుత్వం గురువారం ఉపసంహరించుకుంది. అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి  ఈ నిర్ణయం తీసుకుంది.

సీబీఐకి పశ్చిమబెంగాల్‌లోనూ ‘నో ఎంట్రీ’…?

మరోవైపు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్నే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. సీబీఐ చట్టాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలను త్వరలోనే తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్రాల పరిధిలో కేంద్రం తప్పుడు వైఖరిని అనుసరిస్తోందని. బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని.. సీబీఐ, ఈడీ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని యత్నిస్తోందని మమతాబెనర్జీ దుయ్యబట్టారు. బీజేపీ కుతంత్రాల వల్ల దేశానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, ఏపీ మాదిరే తమ రాష్ట్రంలో కూడా సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు యోచిస్తున్నామని చెప్పారు.

- Advertisement -