2019 ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమి తప్పదా? ఆంగ్ల పత్రిక సంచలన కథనం…

4:32 pm, Sat, 30 March 19
English News Papper News, Chandrababu Latest News, Election News, Newsxpressonline

అమరావతి: ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ’ది ఎకనమిక్ టైమ్స్’ చంద్రబాబునాయుడుపై సంచలన కథనం ప్రచురించింది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తప్పదని తేల్చేసింది. అందుకు తన కోణంలో కొన్ని పాయింట్లను కూడా ఉదహరించింది. అంటే విశ్లేషణ ప్రకారం సదరు పత్రిక చెప్పిన ఉదాహరణలు చూస్తే.. జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి రానున్నారని అర్ధమైపోతోంది.

రాజకీయంగా పొరబాట్లు చేయటం, కీలక సమయాల్లో తప్పులు చేయటం చంద్రబాబుకు బాగా అవాటుగా తన విశ్లేషణలో ఆ పత్రిక పేర్కొంది.  అంతేకాదు, 2004లో ముందస్తు ఎన్నికలకు పోవటం చంద్రబాబు చేసిన అతిపెద్ద పొరబాటుగా గుర్తు చేసింది.

మావోయిస్టుల దాడి తర్వాత లేని సింపతీని ఉందనుకుని చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి దారుణంగా దెబ్బతిన్నట్లు చెప్పింది.  పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ మద్దతు వల్ల వైఎస్ జగన్‌పై స్వల్ప మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కూడా చంద్రబాబుది రాంగ్ స్ట్రాటజీగా ’ది ఎకనమిక్ టైమ్స్’ పేర్కొంది. పవన్ కళ్యాణ్‌తో విడిగా పోటీ చేయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతుందనేది చంద్రబాబు ఆలోచనట. కానీ వాస్తవంగా అలా జరగదని ఆ పత్రిక చెప్పింది.

అంతేకాదు, ప్రధాని నరేంద్రమోడీపై యాంటీ వేవ్ ఉందనే చంద్రబాబు భ్రమ కూడా తప్పే అని చెప్పింది. నిజానికి చంద్రబాబు అనుకున్నంత స్ధాయిలో మోడీపై జనాల్లో వ్యతిరేకత లేదని తేల్చేసింది. అలాగే ప్రతీరోజు కేసీఆర్ , మోడీలను తిడితే జనాలు టీడీపీకి ఓట్లేస్తారని అనుకోవటం కూడా రాంగ్ స్ట్రాటజీనే అని విశ్లేషించింది.

ఐదేళ్ళ పాలనా వైఫల్యాల కారణంగా 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగలబోతోందంటూ ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. క్యాస్ట్, కరప్షన్, క్రైమ్ అనే ప్రధాన అంశాల మీదే జనాలు ఓట్లేయబోతున్నట్లు పత్రిక అంచనా వేసింది. కేసీఆర్ , మోడీలతో జగన్ జతకట్టాడు అనే నిరాధార ఆరోపణలు చేయటం వల్ల కూడా చంద్రబాబుకు పెద్దగా ఉపయోగం ఉండదట.

ఎందుకంటే, ముదస్తు ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించారు. రేపు మోడీ కూడా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి వారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చటం వల్ల ఏపీలో అధికారంలోకి రాబోయేది జగనే అని స్వయంగా చంద్రబాబు అంగీకరిస్తున్నట్లుంది అంటూ ’ది ఎకనమిక్ టైమ్స్’ విశ్లేషించింది.