ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో 657 కేసుల నమోదు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్‌ కేసులు బయటపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 611 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 46 మందికి కరోనా సంక్రమించినట్టు తేలింది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15,252కి పెరిగింది.

కోవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 193కి చేరింది. అలాగే, కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,988కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 8,071 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,18,429 నమూనాలు పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

- Advertisement -