చంద్రబాబుపై ఆగ్రహం! ఐఏఎస్‌ల కీలక భేటీ!

11:18 am, Tue, 7 May 19
Chandrababu Naidu Varthalu, AP IAS Latest News, AP Latest News, Newsxpressonline
అమరావతి: చంద్రబాబునాయుడుపైనే ఐఏఎస్ లు బాగా సీరియస్ అవుతున్నారు. మామూలుగా ఐఏఎస్ లపైన ఇతర అధికార యంత్రాంగంపై చంద్రబాబు సీరియస్ అవ్వటం అందరూ చూసుంటారు. కానీ ప్రస్తుతం మాత్రం రివర్సులో ఐఏఎస్ లే చంద్రబాబుపై సీరియస్ అయ్యారు. అందుకే ఆదివారం అర్ధరాత్రి సమయంలో అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. చంద్రబాబు వ్యవహార శైలిని తూర్పారబట్టారు.

మామూలుగ అయితే బ్యూరోక్రాట్స్ తో గొడవ పెట్టుకోవటం చంద్రబాబు తత్వంకాదు. ఎందుకంటే, చంద్రబాబు వ్యవహారాలన్నింటినీ అధికారులపై ఆధారపడే చక్కబెట్టేస్తుంటారు. అలాంటిది వయసు ప్రభావమో లేకపోతే ఓటమి భయమో తెలీటం లేదు. అందులోను తనకిష్టం లేని ఎల్వీ సుబ్రమణ్యం చీఫ్ సెక్రటరీగా రావటాన్ని కూడా చంద్రబాబ జీర్ణించుకోలేకపోతున్నారు.

 
చదవండి: ఆ వైసీపీ సిట్టింగ్ సీటుని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమేనట…

దానికితోడు ఇటు ఈసి, అటు ఎల్వీ ఇద్దరూ నిక్కచ్చిగా వ్యవహారాలు నడపటంతో ఎన్నికల్లో టిడిపికి స్వేచ్చలేకుండా పోయింది. దాంతో ఈసి, ఎల్వీలపై చంద్రబాబు ప్రతీరోజు మండిపోతున్నారు. అందుకే క్యాబినెట్ సమావేశం పెడతానంటూ సవాలు చేశారు. క్యాబినెట్ సమావేశానికి హాజరుకాని వాళ్ళపై సీరియస్ చర్యలుంటాయని చంద్రబాబు బెదిరించారు. దాంతో అందరికీ చంద్రబాబుపై మండిపోయింది.

అసలు క్యాబినెట్ సమావేశమే పెట్టకూడదంటే గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇవ్వటమేంటంటూ మండిపోతున్నారు. అందుకనే అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. నిజంగానే చంద్రబాబు గనుక క్యాబినెట్ సమావేశం పెడితే తమ తడాఖా ఏంటో చూపించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.

తాజాగా ఐఏఎస్ ల సమావేశంతో చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకోవటానికే అందరూ సిద్దపడుతున్నట్లు అర్ధమైపోతోంది. ముఖ్మమంత్రి-అధికార యంత్రాంగానికి మధ్య ఇటువంటి ఘర్షణ వాతావారణం గడచిన 40 ఏళ్ళల్లో ఎన్నడూ లేదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. అనవసరంగా చంద్రబాబే చెత్త నెత్తినేసుకుంటున్నట్లు సదరు ఉన్నతాధికారి స్పష్టం చేశారు.