రాష్ట్రాన్ని రుణాంధ్రగా మార్చేశారు: మండిపడ్డ యనమల, ఏపీ బడ్జెట్‌పై విమర్శల వర్షం…

yanamala-rama-krishnudu
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు తప్ప

బడ్జెట్‌లో ఏమీ లేదని ఆరోపించారు. దురద్దేశంతో ఎకనామిక్ సర్వే లెక్కలు తప్పుగా చెప్పారని, బంగారం లాంటి రాష్ట్రాన్ని రుణాంధ్ర ప్రదేశ్‌గా మార్చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 60ఏళ్లలో రూ.3

- Advertisement -

లక్షల కోట్ల అప్పులు ఉంటే.. వైసీపీ ప్రభుత్వం 5ఏళ్లలోనే 3.5లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే రూ.60 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఇరిగేషన్‌పై టీడీపీ ప్రభుత్వం చివరి

ఏడాది 14 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ తొలి ఏడాదిలో రూ. 4 వేల కోట్లే ఖర్చు చేసిందని తెలియజేశారు. గతంలో తమ ప్రభుత్వం తెచ్చిన 34 పథకాలను రద్దు చేశారని, దీనివల్ల అభివృద్ధి కుంటుబడిందని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.

- Advertisement -