పార్టీ నేతల మధ్య విభేదాలు.. వైసీపీ నాయకురాలు బొడ్డపాటి అరుణ ఆత్మహత్యా యత్నం

- Advertisement -

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. టంగుటూరులో ఆ పార్టీ మహిళా నేత బొడ్డపాటి అరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

సోమవారం టంగుటూరు మండల వైసీపీ సమీక్ష సమావేశానికి వెళ్లిన అరుణను రావూరి అయ్యవారయ్య వర్గీయులు అడ్డుకున్నారు.

- Advertisement -

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ ఇంటికి చేరుకుని నిద్ర మాత్రలు మింగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు ఆమె వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అరుణ ప్రస్తుతం వైసీపీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. మండలంలోని నేతలందరినీ అనుమతించి ఆమెను నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -