వైఎస్ జగన్‌ సడన్ డెసిషన్.. లండన్‌ పర్యటన రద్దు! కారణం ఏమిటో?

10:44 am, Sat, 4 May 19
YS Jagan Updates, AP Latest News, YS Jagan Latest News, Newsxpressonline

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లండన్ పర్యటన రద్దు అయ్యింది. రేపు ఉదయం కుటుంబ సమేతంగా జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే సడన్‌గా టూర్ రద్దైంది. అయితే టూర్ ఎందుకు రద్దు అయ్యింది జగన్ ఎందుకు రద్దు చేసుకున్నారు. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఏపీలో ‘ఫణి’ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అట్టుడుకుతున్నాయి. వైఎస్ జగన్ ఈ వ్యవహారాలేమీ పట్టించుకోకుండా సినిమాలు, టూర్‌లకు వెళ్తున్నారని టీడీపీ నేతలు, చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

శనివారం నుంచి ఈ నెల 14వరకు లండన్‌లోనే జగన్ ఉండాల్సి ఉంది. జగన్ కుమార్తె లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. కుటుంబ సమేతంగా ఆయన కుమార్తె దగ్గిరకి వెళ్లనున్నారు.

ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో మరోమారు విదేశాల్లో విహారయాత్రకు జగన్ వెళ్తున్నారని.. తిరిగి మళ్ళీ 14వ తేదీ హైద్రాబాద్‌కు వైఎస్ జగన్ చేరుకోనున్నారని గత రెండ్రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి:  చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చిన సీఎం రమేష్! ఆపద్భాంధవుడు ఎవరు!