వై ఎస్ వివేకానంద రెడ్డి మృతి! జగన్ కి ఫోన్ చేసిన కేటీఆర్ ! ఏంచెప్పాడో తెలుసా?

6:32 pm, Fri, 15 March 19
YS Vivekananda Reddy killed KTR calls to Jagan! What do you know?, Newsxpressonline

హైదరాబాద్: మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద ఆకస్మిక మరణం అయన కుటుంబాన్ని తీవ్రశోకంలోనింపింది. అయన తన అన్న సీఎం గ ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలని మొత్తం ఆయనే చూసుకునేవారు. ప్రతిపక్షం లో ఉన్న కూడా తన అద్భుతమైన ప్రతిభతో ముందుకు పోవడం ఆయనకి మాత్రమే చెల్లింది.

వివేకా మరణం పై వైసీపీ కి చెందిన నేతలు ఆయనకి నివాళ్లు అర్పించారు. అయన మరణం పై వారు మాట్లాడుతూ …వై ఎస్ వివేకా మరణం మా అందరిని ద్రిగ్భ్రాంతికి గురి చేసింది.

వై ఎస్ వివేకానంద రెడ్డి పులివెందుల నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గాను , కడప నుండి రెండు సార్లు లోక్ సభకి ఎంపికైయ్యారు. అలాగే శాసనమండలి సభ్యునిగా కూడా పనిచేసారు. ఆ పై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా రాష్ట్ర ప్రజలకి అయన సేవలందించారు. మాజీ మంత్రిగానే కాకుండా ప్రస్తుతం వైసీపీ తరుపున చురుగ్గా పాల్గొంటూ వైసీపీ ని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడానికి జగన్ కి చేదోడు వాదోడుగా ఉన్నారు.

ఏ సహాయం కావాలన్నా మేమున్నాం..

అటువంటి ఆ వ్యక్తి , అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు దివంగత నేత , సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడిగా ఉన్నా కూడా చాలా సాధారణమైన జీవితాన్నే గడిపాడు. అటువంటి వ్యక్తి మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో , జగన్ కి సహాయంగా ఉంటున్న సమయంలో ఇలా జరగడం తీవ్ర విచారకరం అని పలువురు తమ సంతాపాన్ని జగన్ కి , కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఎమ్మెల్యే , తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైసీపీ అధినేత జగన్ కి ఫోన్ చేసి తన సంతాపాన్ని , ప్రగాఢమైన సానుభూతుని తెలియజేసారు. వైసీపీలో ఎంతో యాక్టీవ్ మెంబెర్ గ ఉన్నటువంటి మీ బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి గారి మరణ వార్త విన్న వెంటనే తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురైయ్యాము.

ఇటువంటి సమయంలో పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబ సబ్యులని కోల్పోతే ఏ విదంగా ఉంటుందో అర్థం చేసుకోగలం అని అయన మరణం పట్ల కేటీఆర్ , జగన్ కు, వారి కుటుంబానికి తన సానుభూతిని , సంతాపాన్ని తెలియజేసాడు.