రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో వైసీపీ ఘన విజయం

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ తరపున బరిలోకి దిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు.

మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు కాని ఓట్లన్నీ టీడీపీ సభ్యులవే కావడం గమనార్హం. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ ముగిసిన ఓట్ల లెక్కింపు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -