గంటా ఓడిపోబోతున్నారంటా:  బీజేపీ నేత విష్ణు సంచలన వ్యాఖ్యలు

4:48 pm, Mon, 20 May 19
ganta srinivasa rao News, BJP Latest News, AP elections News, Newsxpressonline

ఢిల్లీ: అటు లోక్‌సభ..ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి వరుసగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న తరుణంలో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విశాఖ నార్త్ లో పోటీ చేసిన టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.

ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ నిచ్చిందని, ఆ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఏపీలో బీజేపీ ఒక్క పార్లమెంట్ గెలవదని చెప్పారు.

చదవండి:  నేను ఓడిపోతా కానీ.. మా పార్టీకి 30 సీట్లు గ్యారెంటీ: కేఏ పాల్

ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే డబ్బు ఖర్చు చేయలేదని, టీడీపీ, వైసీపీలు డబ్బులు కుమ్మరించాయని ఆరోపించారు. అటు దేశ వ్యాప్తంగా బీజేపీకి అధిక సంఖ్యలో వస్తాయని తేలడంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువైందని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలన్న వారి కలలు కల్లలేనని వ్యాఖ్యానించారు.

అలాగే పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 సీట్లకి గాను బీజేపీకి 30 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు.

చదవండి:  పవన్ సంచలన నిర్ణయం! ఆనందపడేది వారేనా?