ఏపీ ఓటర్లకు శుభవార్త! హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక రైళ్లు!

6:01 pm, Wed, 10 April 19
railway

హైదరాబాద్: లోక్‌సభ, ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే అన్ని బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు చార్జీలతో సామాన్యుడి జేబులకు చిల్లుపెడుతున్నాయి.

మరికొన్ని ట్రావెల్స్ ఉన్నపళంగా సర్వీసులను రద్దుచేస్తుండడంతో ఆంధ్రా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ఓటర్లకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బుధవారం సాయంత్రం నుంచి మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

1. ట్రైన్ నెం.07003: సికింద్రాబాద్-కాకినాడ జనసాధారణ్ స్పెషల్ ట్రైన్

ఇది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 06.20 నిమిషాలకు బయలుదేరుతుంది. ఖాజీపేట్ మీదుగా వెళ్లే ఈ రైలు గురువారం ఉదయం 05.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

2. ట్రైన్ నెం.07022: సికింద్రాబాద్-తిరుపతి జనసాధారణ్ స్పెషల్ ట్రైన్
ఇది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 07.20 నిమిషాలకు బయలుదేరుతుంది. ఖాజీపేట్ మీదుగా వెళ్లే ఈ రైలు గురువారం ఉదయం 09.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

3. ట్రైన్ నెం.07201: లింగంపల్లి-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్

ఇది లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 08.50 నిమిషాలకు బయలుదేరుతుంది. గుంటూరు, భీమవరం మీదుగా వెళ్లే ఈ రైలు గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.