దేవుడా… ఇలాంటి సర్వే ఎవరూ ఊహించరు! ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే…

11:08 am, Wed, 8 May 19
AP Latest Survey News, YS Jagan Updates, Chandrababu Naidu Varthalu, Newsxpressonline

అమరావతి: ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతోంది. సరిగ్గా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. దీంతో అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పటికే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలు టెన్షన్‌లో ఉండిపోయారు.

అయితే ఫలితాలు వచ్చే లోపు అనేక సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ….పార్టీ కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వీటిల్లో కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉంటే…మరికొన్ని వైసీపీ అనుకూలంగా ఉంటున్నాయి.

చదవండి: ఆ వైసీపీ సిట్టింగ్ సీటుని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమేనట…

ఈ క్రమంలోనే తాజాగా అనానమస్ పేరిట సోషల్ మీడియాలో ఓ సర్వే హల్‌చల్ చేస్తుంది. ఈ సర్వేలో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు ఉన్నాయి. ఈ సర్వే లెక్కల ప్రకారం వైసీపీతో, టీడీపీకి సమానంగా సీట్లు వస్తాయని చెప్పింది. అయితే వైసీపీ 77స్థానాలను, టీడీపీ 76 స్థానాలు గెలుచుకుంటుందని తేల్చింది.

ఇక జనసేన మాత్రం 22 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పింది. కర్నాటక తరహాలో పవన్ కల్యాణ్ సీఎం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఒకవేళ ఇదేగనుక నిజమైతే జనసేన కార్యకర్తలు పండుగ చేసుకోడం ఖాయం.  మరి సర్వే లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మే 23వరకు వేచి ఉండాల్సిందే.

చదవండి: పవన్ కింగ్ అయినా..కింగ్‌మేకర్ అయినా కావొచ్చంటున్న మాజీ నేత…