బాబుకి బిగ్ షాక్! వైసీపీలోకి మోహన్ బాబు..రేపటినుండి ప్రచారం!

1:54 pm, Tue, 26 March 19
ysrcp

హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖ సినీ నటుడు మోహన్‌ బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారం తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్‌ పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న మోహన్‌బాబు ఆయనతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌, మోహన్‌ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

పదవులు కాదు ..భవిష్యత్ కోసం

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు తన విద్యాసంస్థల విద్యార్థులు మోసం చేశారని, ఫీజులు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను అనేక ఇబ్బందుల పాలు చేశారు అంటూ మోహన్ బాబు చంద్రబాబు ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

తన విద్యాసంస్థలలో పేద విద్యార్థులకు ఎన్నో రాయితీ ఇస్తున్నట్లు చెప్పాడు మోహన్ బాబు. రాబోతున్న ఎన్నికలలో జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అనేక మంది జీవితాలు వెలుగుమయం అవుతాయని, ముఖ్యంగా పేదలకు ఉన్నత విద్యలు అందుబాటులో ఉంటాయని చెప్పాడు . అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని నేపద్యంలో తన సొంత డబ్బులతో విద్యాసంస్థల అధ్యాపకులకు జీతాలు చెల్లిస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు.

ఇన్ని కష్టాలు పడుతూ కాలేజీని రన్ చేస్తుంటే , ఫీజు చెలించాల్సిపోయి , తమపైనే బురద జల్లుతున్నారు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కానీ రాజ్యసభకు ఛాన్స్ ఇస్తా అని జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. రాష్ట్రం అంతా తిరిగి వైసీపీ తరుపున ప్రచారం చేయబోతున్నట్టు తెలిపాడు. అలాగే తాను పదవి ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. తెలుగు ప్రజల మేలు కోసమే వైసీపీలో చేరానన్నారు