లగడపాటి సర్వే టీడీపీకి అనుకూలంగానే ఉంటుందా?

10:55 am, Sat, 11 May 19
lagadapati-rajagopal

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు అనేక సర్వేలు వైసీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 19న లగడపాటి చెప్పే ఎక్జిట్ పోల్ సర్వే ఎలా ఉండబోతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే మొదటి నుంచి ఆయన సర్వే ఎక్కువ శాతం టీడీపీకే అనుకూలంగా ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఎన్నికల సమయంలో అనుభవజ్ఞులకే ఈసారి ఏపీ ప్రజలు పట్టం కడుతున్నారని లగడపాటి చిన్న క్లూ ఇచ్చారు.

చదవండిఅక్కడ క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందో?

కానీ రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందనే ప్రచారం ఎక్కువగా ఉండటం… ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో సర్వే ఫెయిల్ అవ్వడంతో లగడపాటి ఆచితూచి సర్వే ఇచ్చేందుకు చూస్తున్నారని సమాచారం.

అస్పష్టంగా సర్వే వివరాలు

అందుకోసం ఈసారి ప్రజల నాడిని పట్టడం ఎప్పుడూ లేనంత క్లిష్టంగా మారిందని లగడపాటి చెప్పబోతున్నట్లు తెలిసింది. ఇలా చెప్పడం ద్వారా లగడపాటి ముందస్తుగా జాగ్రత్త పడబోతున్నారనీ, ఒకవేళ టీడీపీ కాకుండా వైసీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు తన సర్వే రిపోర్టును ప్రజలు తప్పుపట్టకుండా ఉండేందుకే లగడపాటి అస్పష్టమైన ఫలితాల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.

మొత్తం మీద మే 23న వచ్చే ఫలితాల కోసం ఎదురుచూడటమే బెటర్ అని ప్రజలు భావిస్తున్నారు. ఒకో సర్వే ఒకరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాటిని నమ్మడానికి వీల్లేదు అనుకుంటున్నారు.

చదవండి: బాబు వ్యూహానికి జగన్ ప్రతి వ్యూహం!