పవన్ కింగ్ అయినా..కింగ్‌మేకర్ అయినా కావొచ్చంటున్న మాజీ నేత…

9:43 pm, Mon, 6 May 19
Pawan Kalyan Latest News, Janasena Latest News, AP Political News, Newsxpressonline

 

ఏలూరు: ఏపీలో ఎన్నికలు ముగిసిన ఫలితాలకు ఎక్కువ రోజులు సమయం ఉండటంతో…టీడీపీ-వైసీపీలు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అనేక సర్వేలు కూడా వెలువడుతున్నాయి. వీటిల్లో కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉంటే…మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి.

చదవండి: చంద్రబాబుకి వెన్నుపోటు పొడించింది వారేనా!?

ఇక జనసేన 4-5 సీట్లు గెల్చుకోవచ్చని కొన్ని చెబితుంటే…14-22 సీట్లు గెలవచ్చని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య సంచలన తీర్పునిచ్చారు. ఈ సారి జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్నందువలన టీడీపీ, వైసీపీలకు మెజారిటీ రాధని తేల్చి చెప్పారు.

అంతేకాదు జనసేన 20 స్థానాలు గెలుచుకుంటుందని పవన్ కళ్యాణ్ కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా కావచ్చని అన్నారు. అసలు ఏ పార్టీకీ 90 సీట్లు రావని రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్న పవన్ నిర్ణయం కీలకమని అన్నారు.

ఈ సారి ఎన్నికలలో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే జనసేనను కలుపోకోవలసి వస్తుందేమో అని ఆయన సూచించారు. మరి చూద్దాం జోగయ్య చెప్పే జోస్యం నిజమవుతుందో లేదో.

చదవండి: కాబోయే సీఎం జగన్ కి చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్ ఇదే!