అక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం…ఇదిగో లెక్క…!

TDP Latest Updates, Chandrababu Latest News, AP Election Latest News, Newsxpressonline

అమరావతి: మరో నాలుగు రోజుల్లో అంటే మే 23న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న లోపల మాత్రం ఫలితాలు ఎలా వస్తాయని వణికిపోతున్నారు.

అయితే ఇప్పటికే అభ్యర్ధులు పోలింగ్ సరళి ఆధారంగా కూడికలు, తీసివేతలు వేసుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ మరోసారి విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు.

చదవండిఅడుగడుగునా అవమానాలే: చెవిరెడ్డిని అడ్డుకున్న వెంకటరామాపురం గ్రామస్తులు…

2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ 9879 ఓట్ల మెజార్టీతో, 2014లో కూడా 9196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈసారి కూడా ఎన్నికల బరిలో దిగిన ఆయన హ్యాట్రిక్ సాధిస్తారని చర్చ జరుగుతుంది.

అటు వైసీపీ తరపున తొలిసారి నంబూరు శంకరరావు బరిలో దిగారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో ఇక్కడి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అయితే ఎన్నికలకు ముందు కొమ్మాలపాటి శ్రీధర్‌ గెలుపు చాలా సులభమని టీడీపీ వర్గాలు అంచనా వేశాయి. అయితే పోలింగ్‌ సమయం దగ్గరపడే కొద్దీ శంకరరావు కూడా గట్టిపోటీ ఇస్తున్నారనే అంచనాకు వచ్చారు.

మండలాల్లో మెజారిటీ…

అయితే పోలింగ్ సరళిని బట్టి చూస్తే వైసీపీ ఎంత పోటీ ఇచ్చిన టీడీపీ గెలుపు పక్కా అని అంటున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంతెంత మెజార్టీ వస్తుందోనన్న దానిపై పార్టీ అంచనా వేసుకుంది.

టీడీపీకి పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు మండలాల్లో మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో వైసీపీకి స్వల్ప మెజారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు లెక్కలుగట్టారు. మొత్తం మీద గతంలో వచ్చిన మెజారిటీ ఇప్పుడు రాకపోయిన…కనీసం 4-5 వేల మెజారిటీతో కొమ్మాలపాటి విజయం సాధిస్తారని తెలుస్తోంది.

చదవండిఎగ్టిట్ పోల్స్…ఎవరికీ షాక్ ఇవ్వబోతున్నాయో చూడండి!