వారిద్దరికీ ఇదే ఆఖరిపోరాటం! మరి విజయం ఎవరిని వరిస్తుందో?

4:49 pm, Wed, 8 May 19
YS Jagan Updates, Chandrababu Naidu Varthalu, AP Latest Political News, Newsxpressonline

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మధ్య జరిగిన ఈ ఎన్నికల పోరాటం ఇదే చివరిదా. ఇక భవిష్యత్తులో మళ్ళీ వీరిద్దరూ కలిసి ముఖాముఖి పోరాటే అవకాశం లేదా, అంటే దాదాపు లేదు అనే తెలుస్తోంది. ఇదెలా సాధ్యం అవుతుందో ఒకసారి చూద్దాం.. ఓ రాజకీయ నాయకుడిగా జగన్ ఏపీ ప్రజలకు పరిచయమై దాదాపు 14 ఏళ్లు, వైసీపీ పార్టీ పెట్టుకునే దాదాపు 9 ఏళ్లు.

ఒక ప్రాంతీయ పార్టీ దాదాపుగా అధికారం లేకుండా తొమ్మిదేళ్లు మనుగడ సాగించడం చాలా కష్టం. అందులోనూ జగన్ వంటి నాయకులపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని ఆర్థికంగా కష్టాలు పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఇవి జగన్ ఒంటరిగా రెండో ఎన్నికలు. ఇప్పటికే పార్టీ కాపాడుకుంటూ రావడమే జగన్‌కు పెద్ద సవాల్ అని చెప్పాలి.

చదవండి:  ఏపీలో వైరల్ అవుతున్న లేటెస్ట్ సర్వే! వైసీపీకి 110 సీట్లు ఖాయమట!

ఇక ఇప్పుడు ఓడిపోతే, ఇక వైసీపీ మళ్లీ 2024 ఎన్నికల వరకూ మనగలగడం అంత ఈజీ కాదు. దాదాపు ఇదే పరిస్థితి లో టీడీపీది కూడా ఒక వేళ టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ మనుగడ కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. చంద్రబాబుకు వయోభారం మీద పడుతోంది. అటు లోకేశ్ కు పార్టీ నాయకత్వ బాధ్యత అప్పగిస్తే పార్టీ ఎంత వరకూ నిలబడుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

పోనీ చంద్రబాబే పార్టీని నడిపిస్తాడని అనుకున్నా, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ టీడీపీని అంత సులభంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సో అటు జగన్, ఇటు చంద్రబాబు, వీరిలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా వచ్చే ఎన్నికలకు మళ్లీ వీరు ప్రత్యర్థులుగా పోరాడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పారు. అందుకే ఇది చంద్రబాబు, జగన్‌ ఆఖరి పోరాటం అంటున్నది. విజయం ఎవరిదో చూడాలి అంటే మే 23 వరకు వేచి చూడక తప్పదు ..

చదవండి:  పీకే పై భారీ ఆశలు పెట్టుకున్న మూడు ప్రధానపార్టీలు!గెలిచేదెవరు? ఓడేదెవరు?