ఈ చర్చ నిజమైతే జనసేనకి తిరుగు లేనట్టే….!

8:57 am, Thu, 9 May 19
Pawan Kalyan Latest News, Janasena Latest Updates, AP Political News, Newsxpressonline

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి….ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు…రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు అనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇక టీడీపీ, వైసీపీలు తమదంటే తమదే అని అధికారం అని ఓ డప్పులు కొట్టేసుకుంటున్నారు. అటు వీరికి తగ్గకుండా జనసేన కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తామని చెబుతుంది. అయితే వాస్తవ పరిస్థితులని బట్టి చూస్తే జనసేన సొంతంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు.

చదవండి: టీడీపీ క్లీన్‌ స్వీప్ చేసే ఆ జిల్లా ఇదే!

కానీ టీడీపీ-వైసీపీలకి మెజారిటీ సీట్లు రాకపోతే జనసేన కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక వైపు టీడీపీ లేదా వైసీపీ గెలవచ్చు అనే చర్చ నడుస్తూ ఉండగానే….హాంగ్ వస్తే పరిస్తితి ఏంటి అనేది కూడా ప్రజల్లో చర్చ ఉంది.

జనసేన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో కూడా వైసీపీ, టీడీపీలకు గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాకుండా తమకు పట్టు ఉన్న స్థానాల్లో కూడా గెలవలేకపోయినప్పటికీ కూడా ఇతర పార్టీల గెలుపోటములని తారుమారు చేసే స్థితిలో ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో హాంగ్ వస్తే పవన్ ఎవరి వైపు ఉంటారనే దానిపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే విషయంపై  చాలాచోట్ల బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఈ పందెలలో జనసేన సపోర్ట్ టీడీపీకి అని 70 శాతం కట్టగా, వైసీపీ మద్దతు అని 30 శాతం బెట్టింగ్ కడుతున్నారని సమాచారం. అయితే ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

చదవండిపీకే పై భారీ ఆశలు పెట్టుకున్న మూడు ప్రధానపార్టీలు!గెలిచేదెవరు? ఓడేదెవరు?