వైఎస్ జగన్ కేబినెట్‌లో.. మంత్రులుగా చాన్స్ దక్కేదెవరికి?

- Advertisement -

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి మెజారిటీతోపాటుగా భారీ విజయాన్నీ కట్టబెట్టారు. మరి ఏపీలో ఇప్పుడిక ఏం జరగనుంది?

చదవండి: సీఎం జగన్ కాన్వాయ్ ప్రత్యేకతలేంటో చూడండి!

వైఎస్ జగన్‌ డ్రీమ్ కేబినెట్ ఎలా ఉండబోతోంది? సీఎంగా ఈనెల 30న జగన్ ప్రమాణం చేయబోతున్నారు. మరి ఆయనతోపాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణం చేస్తారు? జగన్ తన మంత్రివర్గంలో ఏయే ప్రాంతాలకు, నేతలకు ప్రాధాన్యమిస్తారు? ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారాయి.

150 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం…

ఏకంగా 150 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. జగన్‌ను ఏపీ ప్రజలు విశ్వసించి ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టారు. దీంతో జగన్ మంత్రి వర్గంలో స్థానం కోసం పోటీ పడే ఆశావహుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇన్నేళ్లూ పార్టీ కోసం చెమటోడ్చిన పలువురు సీనియర్లతోపాటు కొంతమంది జూనియర్లు సైతం ఆయన మంత్రివర్గంలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు.

చదవండి: ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ మంత్రులు వీరే…

అయితే ఇక్కడో విషయం ప్రస్తావించాలి. ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చి 2011లో వైఎస్సార్సీపీ స్థాపించిన సమయంలో సీమాంధ్రకు చెందిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా వైఎస్ జగన్‌ను అనుసరించారు.

ఎవరా నలుగురు?

వీరిలో ఓ నలుగురికి మంత్రి పదవులు దక్కవచ్చనేది వైఎస్సార్సీపీ వర్గాల సమాచారం. అయితే కచ్చితంగా ఏ నలుగురు అన్న దానిపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. మరోవైపు జగన్ తన కేబినెట్‌లో అన్ని ప్రాంతాలకు, సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించనున్నట్లు చెబుతున్నారు.

రాయలసీమలోని పులివెందుల నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున… కోస్తా, ఉత్తరాంధ్రల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఒకరిద్దరిని జగన్ తన కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

చదవండి: ఘోరంగా ఓడిన టీడీపీ సీనియర్ నేతల వారసులు…

ఇక ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు మంత్రి పదవులు కన్ఫర్మ్ అయిపోయాయి. వారిని తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్‌ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీరికి చాన్స్ దక్కుతుందా?

ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మత్రి ధర్మాన ప్రసాదరావు, కళావతి, రెడ్డి శాంతి జగన్ కేబినెట్‌లో మంత్రి పదవులు ఆశిస్తుండగా, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి, రాజన్న దొర పదవి ఆశిస్తున్నారు.

అలాగే విశాఖపట్నం నుంచి గుడివాడ అమరనాధ్‌, గొర్లె బాబూరావు.. తూర్పుగోదావరి నుంచి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, దాడిశెట్టి రాజా జాబితాలో ఉన్నారు.

చదవండి: నియోజకవర్గాల వారీగా ఏపీలో గెలిచిన ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే !

ఇక పశ్చిమ గోదావరి నుంచి ఆళ్ల నాని, తానేటి వనిత, గ్రంథి శ్రీనివాస్, తెల్లం బాలరాజు ఎదురుచూపు చూస్తుండగా, కృష్ణా జిల్లా నుంచి ఉదయభాను, పార్థసారథి, పేర్ని నాని, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు.. గుంటూరు జిల్లా నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్(ఎమ్మెల్సీ కోటా), అంబటి రాంబాబు, కోన రఘుపతి.. అలాగే ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఉన్నారు.

నెల్లూరు జిల్లా నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి మంత్రి పదవి రేసులో ఉండగా.. చిత్తూరు జిల్లా నుంచి ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి జాబితాలో ఉన్నారు.

చదవండి: టీడీపీ ఓటమికి పరోక్ష కారణం జనసేనేనా?

అలాగే కడప జిల్లా నుంచి శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాష పదవిపై ఆశలు పెట్టుకుని ఉండగా.. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీదేవి, హఫఈజ్ ఖాన్.. ఇక అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శంకర్ నారాయణ జగన్ కేబినెట్‌లో చేరాలనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -