కడప, నెల్లూరులో వైసీపీ ప్రభంజనం! సోషల్ మీడియాలో లేటెస్ట్ సర్వే?

1:04 pm, Mon, 29 April 19
YCP Latest News, AP Latest Survey News, YS Jagan Updates, Newsxpressonline

అమరావతి: ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. 

తాజాగా ఇంటెలిజెన్స్ పేరుతో ఓ సర్వే కలకలం సృష్టిస్తోంది. కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం చూపింది. మొత్తం పది స్థానాలు ఉంటే, ఒక్క రాజంపేట మినహా అన్ని స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా వైసీపీ 9 స్థానాలు గెలుచుకుంటుందట. కానీ జమ్మలమడుగులో మాత్రం టీడీపీ గెలుస్తుందట.

ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 7, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి వైసీపీ రెండు స్థానాలు పెంచుకుని 9 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటుందట. అది కూడా గూడురు.

ఐతే.. సోషల్ మీడియాలో ఎవరుపడితే వారు.. తమ సొంత సర్వేలను తప్పుడు పేర్లతో సర్క్యులేట్ చేస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. కాకపోతే.. ఉత్కంఠతో ఉన్న వారు ఏదో ఒక సమాచారం కోసం అంటూ వీటిని ఫాలో అవుతున్నారు. అసలు విషయం మే 23న కానీ తెలియదు.

చదవండి:  జ‌గ‌న్‌పై ఎన్టీఆర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌! వైసీపీకి మద్దతు ఇచ్చినట్టేనా!