రీపోలింగ్ అప్రజాస్వామికమా? చంద్రబాబుపై జగన్ ఫైర్

8:24 am, Sat, 18 May 19
YS Jagan Latest Updates, Chandrababu News, AP Re Polling News, Newsxpressonline

హైదరాబాద్: ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతుల్లో అక్రమాలు జరిగాయని నిర్దారణకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్ కమ్మపల్లి, కొత్తకండ్రిక, కమ్మపల్లి, వెంకటరామపురం, పులిపర్తివారిపల్లి పోలింగ్ బూతుల్లో ఈ ఆదివారం రీపోలింగ్ జరగనుంది.

చదవండి: చంద్రగిరిలో అర్ధరాత్రి హైడ్రామా! చెవి రెడ్డి అరెస్ట్!

అయితే ఈ రీపోలింగ్ విషయంపై టీడీపీ అభ్యంతరం చెబుతుంది…కేవలం వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని రీపోలింగ్ జరుపుతున్నారని…తాము ఫిర్యాదు చేసిన పోలింగ్ బూతులని వదిలేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలనే ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. సీఈసీ సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు.

వైసీపీ ఫిర్యాదు చేసిన పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని, టీడీపీ ఫిర్యాదు చేసిన పోలింగ్ బూత్‌ల మీద కనీసం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే దీనిపై జగన్ స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో చంద్రబాబు మీద ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు గారూ రీ పోలింగ్ అప్రజాస్వామికమా?, లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయనివ్వకుండా వారి ఓట్లు మీరు వేయడం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడటమా? రీ పోలింగ్ అంటే మీకుందుకు జంకు? అయిదు పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.

చదవండి: అడుగడుగునా అవమానాలే: చెవిరెడ్డిని అడ్డుకున్న వెంకటరామాపురం గ్రామస్తులు