కృష్ణాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేది ఏ పార్టీ అంటే?

11:19 am, Mon, 6 May 19
krishna district local survey

 

విజయవాడ: మరో 16 రోజుల్లో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన…ఎన్నికల కోడ్ ఉండటం వలన ఎగ్జిట్ పోల్ ఫలితాలని వెలువరించడానికి కుదరదు. అయిన చాలా సర్వేలు…సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇక వీటిల్లో కొన్ని సర్వేలు టీడీపీ గెలుస్తుందని చెబుతుండగా…మరికొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకి చెందిన ఒక లోకల్ సర్వే వివరాలు బయటకొచ్చాయి. జిల్లాలోని మొత్తం 16 స్థానాలకి గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుస్తుంద‌ని.. అలాగే టీడీపీ 7 స్థానాల్లో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని ఆ స‌ర్వేలో తేలింది. జనసేనకి ఒక్క సీటు కూడా రాదని తేల్చిచెప్పింది. అలాగే రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించింది. టీడీపీ 10 స్థానాలు కైవ‌సం చేసుకోగా, వైసీపీ 5 స్థానాల్లో విజ‌యం సాధించింది. బీజేపీ 1 స్థానంలో విజ‌యం సాధించింది.

చదవండి:గోదారొళ్ల దెబ్బకి బాబుకి మైండ్‌బ్లాక్! ఆ పార్టీ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించిందా!