విషాదం: మహేష్ అభిమాని దుర్మరణం, ‘మహర్షి’ బ్యానర్ కడుతుండగా…

8:20 am, Thu, 9 May 19
Maharshi

రాజమహేంద్రవరం: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దీంతో మహేశ్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

తమ అభిమానాన్ని చాటుకునేందుకు థియేటర్ల దగ్గర బ్యానర్లతో నింపేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేశ్‌పై ఉన్న విపరీతమైన అభిమానం ఓ అభిమాని ప్రాణాల్ని కోల్పోయేలా చేసింది.

చదవండి: మహర్షి సినిమాపై మంత్రి తలసాని కామెంట్స్…

కరెంట్ షాక్ కొట్టి…

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో మురళీకృష్ణ థియేటర్ ద‌గ్గ‌ర మహేశ్ అభిమాని ఒక‌రు మ‌ర‌ణించారు. మహర్షి సినిమా విడుద‌ల సందర్భంగా మహేశ్ భారీ ఫ్లెక్సీ కడుతూ ప్రమాదశాత్తు ప‌క్క‌నే ఉన్న విద్యుత్ తీగలపై ప‌డ్డాడు.

దాంతో షాక్‌కు గురైన ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనుకోకుండా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో అభిమానులు అంతా షాక్‌లో ఉన్నారు. చ‌నిపోయిన యువ‌కుడు ధవళేశ్వరం ఇండస్ట్రీయల్ కాలనీ ఎర్రంశెట్టి రాజీవ్‌గా పోలీసులు గుర్తించారు.

చదవండిదిల్‌రాజు ఆఫీస్‌పై ఐటీ దాడులు! ఇలాంటివి సహజమేనన్న దిల్‌రాజు!