పదేళ్ల నాటి ‘ట్రెజర్ హంట్’ పోటీ.. ఇప్పటికి కనిపెట్టి నిధిని సొంతం చేసుకున్నాడు…

6:18 pm, Mon, 8 June 20

వాషింగ్టన్: ఎప్పుడో పదేళ్ల క్రితం పోటీ. కానీ ఒక్కరూ గెలవలేదు. చివరికి పదేళ్ల తర్వాత ఇన్నాళ్లకు ఓ వ్యక్తి అందులో గెలిచి నిధిని సొంతం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన పురాతన వస్తువుల సేకర్త ఫారెస్ట్ ఫెన్ దాదాపు 2010లో అమెరికాలోని కొండల్లో ఓ నిధిని దాచిపెట్టారు.

తాను ఓ ట్రెజర్ హంట్(నిధి వేట పోటీ) నిర్వహిస్తున్నానని, అందులో భాగంగా ఓ నిధిని దాచానని ఫెన్ ప్రకటించారు.

దానికి సంబంధించిన కొన్ని క్లూలను ఓ పద్యం ద్వారా వివరించారు. అప్పటి నుంచి ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ ఇది ఎవరికీ కనిపించలేదు.

ఇక దానిని ఎవరూ కనిపెట్టలేరేమోనని ఫెన్ ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో పదేళ్ల తర్వాత ఇప్పుడు ఓ వ్యక్తి దానిని కనిపెట్టాడు.

ఈ విషయాన్ని ఫెన్ స్వయంగా ప్రకటించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడని, దీంతో ఆ నిధంతా అతడి సొంతమైందని చెప్పారు.

ఆ నిధిలో బంగారు నాణేలు, ఆభరణాలు, ఖరీదైన రాళ్లతో ఆ నిధి నిండి ఉన్నాయని, దాని విలువ ఒక మిలియన్ డాలర్ల(75 లక్షల)కు పైగా ఉంటుందని ఫెన్ చెప్పారు.