చైనాలో సంచలనం.. కరోనా వైరస్ నుంచి బయటపడిన వందేళ్ల వృద్ధుడు

11:04 am, Mon, 9 March 20
coronavirus-outbreak-in-china

బీజింగ్: కరోనా వైరస్ సోకిన వందేళ్ల వృద్ధుడు దానిని నుంచి పూర్తిస్థాయిలో బయటపడడం చైనాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ వందేళ్ల వృద్ధుడు ఒకరు గత నెల 24న హుబెయిలోని మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేరాడు.

ఫ్లూ తరహా లక్షణాలతో పాటు అల్జీమర్స్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడికి వైద్యులు 13 రోజుల పాటు చికిత్స అందించారు.

తాజాగా, అతడిని పరీక్షించిన వైద్యులు అతడిలో కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. దీంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

ఫలితంగా కరోనా వైరస్ నుంచి బయటపడిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కాగా, వూహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన ఈ వైరస్ చైనాలో ఇప్పటి వరకు మూడు వేలమందికిపైగా పొట్టనపెట్టుకుంది.

80 వేల మందికిపైగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అలాగే, 70 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. మన దేశంలో 39 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.

ఇది చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఇంట్లో.. తల్లి రావడంతో..