ఓట్లను లెక్కిస్తూ 278 మంది మృతి! 1,878 మందికి అస్వస్థత!

- Advertisement -

ఇండోనేసియా: నమ్మేలా లేకపోయినా ఇది కచ్చితంగా నమ్మాల్సిన నిజం. ప్రజాస్వామ్య చరిత్రలో కనీవినీ ఎరుగని ఘోరం. ఓట్లను లెక్కిస్తూ ఏకంగా 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండలు, ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పని ఒత్తిడి తట్టుకోలేక గుండెలు ఆగిపోయాయి. ఇండోనేసియాలో ఈ దారుణం జరిగింది.

అక్కడ ఈ నెల 17 ఎన్నికలు జరిగాయి. ఒకేసారి పార్లమెంటు, అధ్యక్ష, స్థానికల సంస్థల ఎన్నికలు సహా మొత్తం 5 ఎన్నికలు జరిపారు. దేశంలోని 19 కోట్ల మందిలో 80 మంది ఓట్లేశారు. ఒక్కొక్కరు ఐదేసి చొప్పున వేయడంతో దాదాపు 80 కోట్ల ఓట్ల పడ్డాయి.

Voting Latest News, Election Latest Updates News, Newsxpressonline

అన్నేసి ఓట్లను లెక్కించడానికి ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. కానీ ఎన్నికలన్నీ బ్యాలట్ విధానంలో జరపడంతో అసలు చిక్కు మొదలైంది. ఓట్ల డబ్బాలను మోయడం నుంచి ఓట్లను లెక్కించడం వరకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. బ్యాలెట్ పేపర్లు ఎక్కువగా లెక్కించడంతో చేతులు నొప్పెట్టాయి. తీవ్ర అలసట, అదివరకే ఉన్న ఆరోగ్యం సమసల్యతో 278 మంది కౌంటింగ్ సిబ్బంది మృతి చెందారు.

మరో 1,878 మంది ఆస్పత్రుల పాలయ్యారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దీని వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే షెడ్యూల్‌ ప్రకారం త్వరగా ఎన్నికలు పూర్తి చేసి మే 22 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉండడంతో ఈ సమస్య తలెత్తిందని ఈసీ చెప్పుకుంటోంది.

చదవండి:  శ్రీలంక కీలక నిర్ణయం! బుర్ఖాపై నిషేధం!
- Advertisement -