ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. 170 మంది దుర్మరణం?

11:54 am, Wed, 8 January 20

టెహ్రాన్: యుద్ధ మేఘాలు అలముకుంటున్న ఇరాన్‌లో ఈ ఉదయం ఘోర విషాదం జరిగింది. 180 మంది ప్రయాణికులతో వెళ్తూ ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టెహ్రాన్‌ విమమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.

టెహ్రాన్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం కూలిపోయింది. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనతో టెహ్రాన్ విమానాశ్రయం తాత్కాలికంగా అన్ని సర్వీసులను రద్దు చేసింది. ప్రమాదంలో 170 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది.

ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు హృదయ విదారకంగా ఉన్నాయి. విమాన శకలాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఘటనా స్థలం నిండిపోయింది. కాగా, విమాన ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు.