మాట్లాడడం కూడా చేతకాని జోబిడెన్ అధ్యక్షుడు కాబోతున్నాడు: ఓటమిని ముందే అంగీకరించిన ట్రంప్

- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని ముందే ఒప్పేసుకున్నారు. ఈ ఏడాది నవంబరు 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి.

55 శాతం మంది ట్రంప్ ప్రత్యర్థి జో బిడన్‌కు మద్దతు పలుకుతుండగా, 40 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఓటమి నిరాశలో ఉన్న ట్రంప్ జోబిడెన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

మాట్లాడడం కూడా చేతకాని జో బిడెన్ ఈసారి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోబోతున్నానని పేర్కొన్న ట్రంప్.. బిడెన్ మంచోడా? కాదా? అనేది అనవసరమన్నారు.

కానీ, అతడు మాత్రం అధ్యక్షుడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాడని తేల్చి చెప్పారు. తాను ఎంతో చేసినా, కొందరికి తాను నచ్చడం లేదంటూ నిరాశాజనక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -