అమెరికాలో అల్లర్లు.. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లాంచింగ్ వాయిదా

7:40 pm, Sat, 30 May 20

న్యూయార్క్:  ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం బీటా వెర్షన్ లాంచింగ్‌ను గూగుల్ వాయిదా వేసింది. బుధవారం దీనిని విడుదల చేయాలనుకున్నా, నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

‘‘ఆండ్రాయిడ్ గురించి చాలా చెప్పాలని ఉన్నా, ప్రస్తుతానికి ఇది సెలబ్రేట్ చేసుకునే సమయం కాదు’’ అని గూగుల్ తన ఆండ్రాయిడ్ డెవలపర్స్ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఆండ్రాయిడ్ నయా వెర్షన్‌ను ఎప్పుడు లాంచ్ చేయబోతున్నదీ చెప్పనప్పటికీ, త్వరలోనే లాంచింగ్ డేట్‌ను మాత్రం ప్రకటిస్తామని పేర్కొంది.

 

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌లో నోటిఫికేషన్ హిస్టరీ లాగ్, నేటివ్ స్క్రీన్ రికార్డర్, వీడియోలు తీస్తున్నప్పుడు నోటిఫికేషన్ సౌండ్ రాకుండా మ్యూట్ నోటిఫికేషన్ ఆప్షన్ తదితర ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.