కరోన పుట్టుకకు చైనానే కారణమని అమెరికా నిందించిన విషయం తెలిసిందే. దీనికి మద్దతుగా ఆస్ట్రేలియా కూడా కరోన మూలాలపై విచారణ జరపాలని కోరింది.
దీనితో ఆగ్రహించిన చైనా ఆస్ట్రేలియాపై అనేకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతోంది. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ స్పందించారు.
చైనా బెదిరింపులకు భయపడబోమని, అణచివేతకు లొంగేది లేదని స్పష్టంచేశారు. ‘మాది స్వేచ్చాయుత వాణిజ్య విధానం.
ఏ దేశంతో అయినా వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉంటాం. అయితే బెదిరింపులకు భయపడి మా విలువలను తాకట్టుపెట్టి మాత్రం వ్యాపారం చేయం’ అంటూ మోరిస్ ఘాటుగా స్పందించారు.
ఆసియా విద్యార్ధులు ఆస్ట్రేలియాలో జాతి వివక్షకు గురవుతున్నారన్న చైనా ఆరోపనలను కూడా మోరిస్ ఖండించారు.
అవన్ని అసత్య ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియ నుంచి వచ్చే మాంసం దిగుమతులను చైనా ఇటీవల నిషేధించింది.
ఇతర దిగుమతులపైన పన్నులు పెంచేసింది. చైనా టూరిస్టులను కూడా ఆస్ట్రేలియాకు మాత్రం వెళ్ళొద్దంటూ సూచిస్తోంది.
దీని ద్వారా ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకొంటున్నాయి.
మరి ఈ వ్యాఖ్యలపై చైనా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.