బంగ్లాదేశ్‌కు చైనా సాయం.. కరోనా కట్టడికి వైద్య బృందం

- Advertisement -

బీజింగ్: భారత్ సరిహద్దుల్లో ఉన్న దేశాలకు ఏదైనా సాయం కావాలంటే చైనా ఎప్పుడూ ముందుంటుంది.

ఆ దేశాల ద్వారా భారత్‌ను లొంగదీసుకోవచ్చని చైనా కుయుక్తి. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాడేందుకు బంగ్లాదేశ్‌కు సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. 

- Advertisement -

ఇప్పటికే బాంగ్లాదేశ్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 930కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 2700కు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,504కు చేరింది.

ఈ నేపథ్యంలో కరోనాను మీ దేశం నుంచి తరిమికొట్టేందుకు మేము సాయం చేస్తామంటూ చైనా ఆపన్న హస్తం అందిస్తోంది. 

దీనికోసం పది మంది సభ్యులున్న వైద్యా బృందాన్ని బంగ్లాదేశ్‌కు పంపించింది. ఈ మేరకు బాంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

నిర్దేశిత కరోనా ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, క్వారంటైన్ కేంద్రాలను ఈ బృందం సందర్శిస్తుందని ఆయన తెలిపారు.

అక్కడి పరిస్థితులను సమీక్షించిన తరువాత చైనా బృందం బంగ్లా ప్రభుత్వానికి కరోనా కట్టడిపై తగు సూచనలు చేస్తుందని  చెప్పారు. 

అయితే చైనాకు ఉన్నట్లుండి బంగ్లాదేశ్‌పై ఇంత ప్రేమ పుట్టడానికి గల కారణం మాత్రం భారత్‌ను దెబ్బతీయడానికేనని కొందరు నిపుణుల వాదన.

- Advertisement -