కరోనా ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా కండోమ్స్‌కు తీవ్ర కొరత

7:10 pm, Sat, 28 March 20

న్యూఢిల్లీ: కోవిడ్-19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడీ వైరస్ ప్రభావం కండోములపైనా పడింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దీనికి విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో వినియోగదారులు తెగ ఇబ్బందిపడిపోతున్నారు.

లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో చాలామంది కండోములును పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పెట్టుకోవడంతో వీటికి తీవ్ర కోరత ఏర్పడింది.

, ఆఫ్‌లైన్‌లో కండోములు ఎక్కడా దొరకడం లేదు. మరోవైపు కరోనా ప్రభావంతో కండోముల తయారీ కంపెనీలు కూడా మూతపడ్డాయి. దీంతో వాటి ఉత్పత్తి ఆగిపోయింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ డ్యూరెక్స్ (Durex), మలేసియా కంపెనీ కారెక్స్ బీహెచ్‌డీ(Karex Bhd)లు గత వారం రోజులుగా మూతపడ్డాయి.

కారెక్స్‌కు మలేసియాలో ఉన్న మూడు కంపెనీలు గత వారం రోజులుగా ఒక్కటంటే ఒక్క కండోము కూడా తయారు చేయలేదు. అయితే, తాజాగా కారెక్స్ బీహెచ్‌డీకి ఊరట లభించింది.

సాధారణ ఉత్పత్తితో పోలిస్తే 50 శాతం మాత్రమే ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.

ప్రస్తుత డిమాండ్‌కు తగినట్టుగా కండోమ్స్ తయారు చేయాలంటే ఫ్యాక్టరీలకు మరింత సామర్థ్యంతో పాటు సమయం అవసరం ఉంటుందని కారెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గో మియా కియట్ తెలిపారు.

ప్రస్తుతం కండోముల కొరత చాలా తీవ్రంగా ఉందని, ఇది ఒకటి రెండు వారాలతో తీరే సమస్య కాదన్నారు. ఇది మరిన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉందన్నారు.