పాక్‌లో లక్ష దాటిన కరోనా కేసులు.. పరిస్థితి దుర్భరంగా ఉందన్న ప్రధాని

- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ను కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు పెద్దగా పాటించకపోవడంతో ఎక్కడ పట్టినా కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. 

సోమవారం నాడు తొలిసారిగి దాదాపు 100 కరోనా మరణాలు దేశంలో నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,172కు చేరుకుంది.

- Advertisement -

గత 24 గంటల్లో 4,646 కొత్త కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,8317కి చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలోనే పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా కరోనా బారిన పడుతున్నారు. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే 40 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసుల సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉన్న సింధ ప్రావిన్స్‌లో దాదాపు 39 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 35,018 మంది కోలుకున్నారని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తమ దేశం పరిస్థితి దారుణంగా ఉందని, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా ప్రకటించడంతో ఇప్పుడు సంచలనంగా మారింది.

అంతేకాకుండా కరోనా కారణంగా పాక్ ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతోంది. అయితే కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోవడానికి గల కారణాన్ని కూడా ఇమ్రాన్ వెల్లడించారు.

ప్రజలు నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమించడమేనని, ఇలాగే కొనసాగితే కరోనాను అదుపుచేయడం చాలా కష్టమవుతుందని హెచ్చరించారు.

పాకిస్తాన్‌లో ఇప్పటివరకు కరోనా పీక్‌ స్టేజ్ రాలేదని, జులై, ఆగష్టు నెలలో అది వచ్చే అవకాశం ఉందని ఇమ్రాన్ చెప్పారు.

ఆ సమయంలో దేశవ్యాప్తంగా అధిక మొత్తంలో కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని,  లకుంటే దేశం మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కోవలని వస్తుందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

- Advertisement -