కోవిడ్ 19 ఎఫెక్ట్: చైనాలో దారుణంగా పడిపోయిన వాహన విక్రయాలు

1:53 pm, Fri, 14 February 20
coved19-effect-vehicle-sales-dropped-in-china

బీజింగ్: అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చైనాను ఇప్పుడు కోవిడ్-19(కరోనా వైరస్) అతలాకుతలం చేస్తోంది.

చదవండి: డేంజర్ బెల్స్: చైనాలో 50 వేలకు చేరిన ‘కరోనా’ బాధితులు, ఒకేరోజు 14 వేల మందికిపైగా…

ఓ వైపు పౌరుల ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్.. దేశంలోని అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ముఖ్యంగా వాహన తయారీ పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వాహన విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో పరిశ్రమ విలవిల్లాడుతోంది.

గతేడాది జనవరితో పోలిస్తే ఈసారి వాహన విక్రయాలు 20.2 శాతం పడిపోయినట్టు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య (సీఏఏఎం) ప్రకటించింది.

అమ్మకాలు భారీగా పడిపోవడంతో వాహన తయారీ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్టు తెలిపింది. వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు చాలా కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి.

చదవండి: విదేశాల్లో యువతీయువకులు.. ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం.. వీడియో వైరల్

మరోవైపు దేశంలో వాహనాల డీలర్‌షిప్‌లు సైతం మూతబడ్డాయి. మొత్తంమీద కోవిడ్-19 వాహన విక్రయాలను గణనీయంగా దెబ్బతీసిందని సీఏఏఎం పేర్కొంది.